![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -142 లో...... మహా ఆఫీస్ కి వెళ్తుంది. తనకి చక్రి ఫోన్ చేస్తుంటాడు. మహా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ప్లీజ్ అండి.. నన్ను క్షమించండి అని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. మహా తనపై కోప్పడి కట్ చేస్తుంది. అప్పుడే విక్కీ ఫోన్ చేస్తాడు. చక్రి అనుకుని ఎన్నిసార్లు చెప్పాలని అంటుంది. నేను విక్కీని ఎవరైనా మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు. లేదని మహా చెప్తుంది. సరే వర్క్ త్వరగా ఫినిష్ చెయ్యండి అని చెప్తాడు.
ఆ తర్వాత మహాకి తన ఆఫీస్ కొలీగ్ దివ్య కలుస్తుంది. నేను నీతో పాటు హాస్టల్ లో ఉంటానని మహా అడుగుతుంది. మేడమ్ ని అడగాలని చెప్తుంది. ఆ తర్వాత కేశవ దగ్గరికి చక్రి వస్తాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా అంటాడు. ఎందుకు అలా చేసావ్ రా పాపం.. ఆ అమ్మాయి నిన్ను ఇక దగ్గరికి కూడా రానియ్యదని కేశవ కోప్పడతాడు. ఆ తర్వాత మహా హాస్టల్ కి వెళ్లి అక్కడ మేడమ్ తో మాట్లాడుతుంది. ఈ రోజే వచ్చి జాయిన్ అవుతానని చెప్తుంది. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లి బట్టలు సర్దుకుంటుంది మాధవతో నేను హాస్టల్ చూసుకున్నానని చెప్తుంది. నిన్ను వద్దని ఆపే ధైర్యం చెయ్యలేను.. అలా అని అనలేనని మాధవ చెప్తాడు. కన్నా వచ్చి వదినకి ఇష్టమైన కూరగాయలు తీసుకొని వచ్చానని చెప్తాడు. అప్పుడే మహా బ్యాగ్ తో బయటకు వస్తుంది. కేశవ, చక్రి కూడా వస్తారు. నేను తప్పు చేసాను నన్ను క్షమించండి ప్లీజ్ ఇంట్లో నుంచి వెళ్ళకండి అని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. మీరు మాట్లాడకండి అని మహా కోప్పడుతుంది.
అన్నయ్య మీరు చెప్తే వింటుంది ఉండమని చెప్పండి అన్నయ్య అని కేశవ, కన్నా, చక్రి అంటారు. ఎలా అనగలను.. అనలేనని మాధవ అంటాడు. మహా వెళ్తుంటే కేశవ కన్నా వద్దని అంటారు. మీరు అడ్డుపడితే ఆగిపోతాను కానీ నేను ఇక్కడ ఉన్నా లేనట్లే అని మహా అంటుంది. మహాతో మాధవ హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ ఫుడ్ బాగుందో లేదో కనుక్కుంటాడు. మహాని ఇల్లు వదిలేసి వెళ్తుంటే మాధవకి ఏడుపు వస్తుంది. తరువాయి భాగంలో మహా వెళ్ళిపోయిందని ఇంట్లో అందరు డల్ గా ఉంటాడు. మహా కూడా మాధవ వాళ్ళతో ఉన్న విషయాలు అన్నీ గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |